'అభినందన' దర్శకుడు అశోక్ కుమార్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ చెన్నైలో ఈ ఉదయం మరణించారు. తెలుగులో 'అభినందన', 'నీరాజనం' లాంటి కళాత్మక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన వయసు 72 ఏళ్లు. గత ఆరునెలలుగా ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ భాషల్లో సుమారు 100 సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. 1980లో 'నెంజాతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.